search

గులాబి

 

ఏ రోజైతె చూసానో నిన్నూ ఆరోజే నువ్వైపోయా నేనూ ||2||
కాలం కాదన్నా యే దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నానూ
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను యెటువైపున్నా
నీ కష్టంలో నేను ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంప్పల్లో జారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలొ ఓదార్పవుతానూ

కాలం ఏదో గాయం చేసిందీ
నిన్నే మాయం చేసానంటోందీ
లొకం నమ్మి అయ్యొ అంటొందీ
శోకం కమ్మి జోకొడతానందీ
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్ష్యం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ
నాలో మోగే గుండెల సవ్వడులే
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగ
నువ్వు లేకుంటే నేనంటూ ఉండను గా

నీ కష్టంలో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంప్పల్లో జారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలొ ఓదార్పవుతానూ
యే రోజైతె చూసానో నిన్నూ
ఆరోజే నువ్వైపోయా నేనూ
కాలం కాదన్నా యే దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నానూ

You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా