search

Drink plenty of water everyday

వేసవికాలం ప్రారంభం అయ్యింది. పర్యావరణ సమతుల్యత లోపించడం తో భూతాపం పెరిగి ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ఎంతటి ఆరోగ్యవంతులైనా కలవరపరిచే ఈ వేసవిని తట్టుకోవాలంటే అధికంగా నీటిని సేవించడం అత్యంత ఉత్తమం అని వైద్యులు పదేపదే చెబుతున్నారు. ప్రకృతిసిద్ధంగా లభించిన జలం అమృతతుల్యం అంటున్నారు పరిశోధకులు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటును కూడా నియంత్రించవచ్చునని ఇటీవల అమెరికాలోని వండర్‌ఫీల్డ్‌ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక సర్వేలో స్పష్టమయ్యింది. రక్తపోటు, అజీర్తీ, అల్సర్‌, నరాల బలహీనత తదితర అనేక రకాల రుగ్మతలు నీటిని ఎక్కువగా తాగడం ద్వారా చాలా వరకు అదుపులో ఉంటాయని ఈ సర్వేలో వెల్లడించారు. పరిమితంగా నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా కీడు జరుగుతుందని హెచ్చరించారు. నీటిలో ఉండే ఆక్సిజన్‌ కారణంగా అధిక ప్రయోజనాలు ఉన్నాయని, పరిశుభ్రమైన నీటిని ఎక్కువగా తీసుకునే వారిలో సాధారణ అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండదని వైద్యబృందం స్పష్టం చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనేక మందిపై పది సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి నీటి అవశ్యకతను గుర్తించారు. ఎక్కువగా నీటిని తీసుకునే వారి రక్తపు ధమనుల్లో చేరిన మలినాలు పూర్తిగా కరిగిపోతాయని, సాధారణంగా వచ్చే అనేక జబ్బుల నుంచి ఎంతో ఉపశమనం ఉంటుందని వండర్‌ఫీల్డ్‌ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక సర్వేలో స్పష్టమైంది. శరీరంలో రక్తపోటు నియంత్రణలు జలసేవనం మంచి చిట్కాగా వారు పేర్కొన్నారు. రక్తపోటులో బాధపడేవారికి కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి తో పాటు కొన్నిసార్లు సృహకోల్పోవడం వంటి లక్షణాలు కనిపించినపðడు వెంటనే గ్లాస్‌ నీటిని తాగడం ద్వారా చాలా ఉపశమనం కలుగుతుంది. శరీరంలోని నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలని ఈ పరిశోధనలో తేలింది. దాహంగా లేకపోయినా ప్రతిపదినిమిషాలకు ఒక్కసారి గ్లాసు నీరు తాగడం ఆరోగ్యసూత్రాలలో మొట్టమొదటిదిగా వైద్యలు పదేపదే సూచిస్తున్నారు. రోజు వారీ పనులకు కావలసిన శక్తిని నీటి నుంచి పొందవచ్చుని తమ పరిశోధనలతో స్పష్టం చేస్తున్నారు. నీటిని అధికంగా సేవించడం వల్ల లాభాలే తప్ప ఎలాంటి అనారోగ్యం ఉందబోదని, ఎంత ఎక్కువగా నీటిని తాగితే జీర్ణక్రియ అంత వేగంగా పనిచేస్తుంది. ఆరు నెలల వయస్సు నిండిన చిన్నారులకు సైతం తప్పనిసరిగా నీటిని తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులలో వచ్చే అజీర్ణసమస్యలకు నీరు ఎక్కువగా సేవించడం మంచి పరిష్కరం. ముఖ్యంగా వేసవికాలంలో నీరు మరింత ఎక్కువగా తీసుకుని అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ 12 నుంచి 15 గ్లాసుల నీరు తాగడం అనేది మంచి అలవాటు. పాలిచ్చే తల్లులు మరో నాలుగు గ్లాసులు ఎక్కువగా నీటిని తీసుకోవాలి. అయితే 65శాతం సురక్షితం కాని నీరే మనకు అందుబాటులో ఉంది. ఈ నీటిని తాగడం ద్వారా కాలానుగుణంగా వచ్చేవ్యాధులు అధికంగా వ్యాపిస్తాయి. నీటిలో ఉండే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా నశించేలా నీటిని మరిగించి, చల్లార్చి, వడకట్టి తీసుకోవడం అన్నివిధాల శ్రేయస్కరం.

You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా