ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు(2)
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా
జగడపు చనవుల జాజర
సగిణల మంచపు జాజర
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన బుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర ||జగడపు||
భారపు కుచముల పైపైకడు
సింగారము నెరపెటి గందవొడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు జల్లేరు జాజర ||జగడపు||
బింకపు కూటమి పెనగెటి చమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదంబుల జాజర ||జగడపు||