search

సిరివెన్నెల

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ॐ
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదమ్...ॐ
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..
ఎదకనుమలలొ ప్రతిద్వనించిన విరించి విపన్చి గానమ్....ఆఅ..

సరశశ్వరసురాఝారీగమనమవు సమావేద సరమిది...
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..

విరించినై విరచించితిని ఈ కవనం..
విపన్చినై వినిపించితిని ఈ గీతం....

ప్రాకృత వీణియ పైన దినకర మయూఘ తాంత్రులపైనా..
జాగృత విహంగ తాతులై వినీల గగనపు వేదిక పైన...::2::
పలికిన కిలకిల ధ్వనముల స్వరగథి జగతికి శ్రీకారము కాగా..
విస్వకార్యమునకిది భాష్యముగా....

విరించినై.....

జనించు ప్రథిసిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయామృదంగధ్వానం...:2:
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహినీ గా..
సాగిన సృష్టి విధానము నే,,,

విరించినై...

నా ఉఛ్వాసమ్ కవనం నా నిశ్వాసమ్ గానం
సరశశ్వరసురాఝారీగమనమవు సమావేద సారమిది...
నేపాడిన జీవన గీతం..ఈ.. గీతం.

You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా