search

సిరివెన్నెల

 

ఈ గాలి, ఈ నేలా, ఈ ఊరు, సేలయేరూ..
నను కన్న నా వాళ్ళు....ఆ...నా కళ్ళ లోగిళ్ళు...||ఈ గాలి||

చిన్నారి గొరవంక , కూసేను ఆ వంక....నా రాక తెలిశాక, వచ్చెను నా వంక... ||2 times||
ఎన్నాళ్ళో గడిచాక, ఇన్నాళ్ళకు కలిసాక...||2 times||
ఉప్పొంగిన గుండెల కేక....ఎగసేను నింగి దాక..ఎగసేను నింగి దాకా..ఆ.......||ఈ గాలి||

ఏనాడు ఏ శిల్పి, కన్నాడో ఈ కలను... ఏ ఉలి తో ఈ శిలపై మలిచాడో ఈ కళను... ||2 times||
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధను....||2 times||
ఈ రాళ్ళే జవరాళ్లై, ఇక నాట్యలాడేను .....||ఈ గాలి||

You're watching

uTubeTelugu

తెలుగు వీడియో ఖజానా